జెర్సీ కి రూ.35 కోట్లు అడుగుతున్నాడట..

నాని – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ జెర్సీ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఫై క్రికెట్- మిడిల్ క్లాస్ స్ట్రగుల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు నాట హిట్ టాక్ తెచ్చుకొని..మంచి కలెక్షన్లు రాబట్టింది. అందుకే ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు పోటీ పడుతున్నారు. అందులో భాగంగా బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని దిల్ రాజు , అల్లు అరవింద్ కలిసి రీమేక్ చేయబోతున్నారు.

ఈ రీమేక్ లో షాహిద్ క‌పూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మధ్యనే అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకున్నారు. ఇప్పుడు నాని న‌టించిన‌ జెర్సీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి గాను షాహిద్ రూ. 35 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట.