శృంగార తార బయోపిక్ ట్రైలర్

సన్ని లియోన్ ఈ పేరు చెప్పగానే శృంగార ప్రియులు ఉత్సహంతో ఊగిపోతారు, అలాంటిది ఏకంగా ఆ పేరు మీదే ఒక మూవీ వస్తుందంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. కానీ సన్నీలియోన్ పేరు మీద మూవీ కాకుండా ఒక వెబ్ సిరీస్ రాబోతుంది. ఈ మధ్య వెబ్ సిరీస్ ల హావ నడుస్తున్న తరుణం లో ‘కరణ్‌జీత్‌ కౌర్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్ సన్నీ లియోనీ’ అని సన్ని లియోన్ జీవితగాధని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసారు.

ఆమె కెనడాలోని భారతీయ వలసదారులకు కరెన్జిత్ కౌర్ వోహ్రా (సన్నీ లియోన్ అసలు పేరు) గా జన్మించింది . కుటుంబం లో ఆర్థిక ఇబ్బందులు శృంగార, వినోదం లో చేరడానికి కారణం అయ్యాయి అని ఈ ట్రైలర్ లో చూపించారు. సన్నిలియోన్ చిన్నప్పటి పాత్రలో రైసా సౌజానీ అనే అమ్మాయి నటించింది. జులై16న ఈ సిరీస్‌ విడుదల కానుంది.

శృంగార తారగా ఉన్న సమయంలో బాలీవుడ్ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది.ఆ షో తరువాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.19 ఏళ్ళ వయసులోనే పెంట్ హౌస్ అనే మ్యాగజైన్ ఫై కనబడింది.