రజనీకాంత్ ‘జైలర్’ లో తమన్నా !


మిల్కీబ్యూటీ త‌మ‌న్నా త‌న దూకుడు చూపిస్తోంది. క‌థానాయిక‌గా క్రేజీ అవ‌కాశాలు అందుకొంటోంది. ఇప్ప‌టికే భోళా శంక‌ర్ వంటి భారీ చిత్రంలో చిరంజీవితో జోడీగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌ ‘జైలర్’ లో న‌టిస్తుంది. త‌లైవ‌ర్ ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే స‌ముద్ర ఖ‌ని, సునీల్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ చిత్రంలో తాజాగా త‌మ‌న్నా అడుగు పెట్టింది. ర‌జినీకాంత్‌తో త‌మ‌న్నా న‌టిస్తోన్న తొలి చిత్ర‌మిది. మ‌రి ఆమె జైల‌ర్ సినిమాలో రజినీకాంత్‌కు జోడీగా క‌నిపిస్తుందా? లేక కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుందా అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగ‌క త‌ప్ప‌దు.

ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌లో ఫుల్ బిజీగా ఉన్న త‌మ‌న్నా.. ప‌ర్స‌న‌ల్ జీవితంలోనూ కొత్త అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏంసీఏ, గ‌ల్లీ బాయ్స్ చిత్రాల ఫేమ్ విన‌య్ వ‌ర్మ‌తో మిల్కీ బ్యూటీ ప్రేమాయ‌ణం సాగిస్తుంది. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా గోవాలో వీరిద్ద‌రూ క‌లిసి ఉన్న ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌టంతో విష‌యం తెలిసింది. మ‌రి ఈ ఏడాదిలోనే వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటారా.. ఏమో చూడాలి. తన ప్రేమ విష‌యంపై ఇటు త‌మ‌న్నా.. అటు విన‌య్ వ‌ర్మ ఏమీ రియాక్ట్ కాలేదు.