థమన్ వీరకొట్టుడికి థియేటర్స్ బాక్స్ లు బద్దలవుతున్నాయి

ఈ మధ్య ఎక్కడ చూసిన థమన్ పేరే వినిపిస్తుంది.. ఏ పాట విన్న కూడా అది థమన్ నుండి వచ్చిందే. థమన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నప్పటికీ చిన్న , పెద్ద సినిమాల వారంతా ఆయన్నే కావాలని కోరుకుంటున్నారు. తాజాగా ఈయన చేసిన అఖండ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ’ సినిమాకి ఫుల్ మాస్ BGM కొట్టడంతో థియేటర్ లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. అఘోరాగా బాలయ్య సృష్టించిన విధ్వండానికి, బోయపాటి మాస్ ఎలివేషన్స్ కి తమన్ వీర కొట్టుడు మ్యూజిక్ తోడవటంతో థియేటర్స్ లో బాక్సులు బద్దలైపోతున్నాయని అంటున్నారు.

ఓ సినిమా థియేటర్ హాల్ బయట పెట్టిన ఓ నోటిస్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అఖండ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల మా స్పీకర్లు పగిలిపోయే ప్రమాదం ఉంది. తమన్ కొట్టిన మ్యూజిక్ ని తట్టుకోవడం మావల్ల కాదు అందుకే సౌండ్ కొంచెం తగ్గించి సినిమాని చుపిస్తాము అంటూ నోటీసులు పెట్టారు. ఈ నోటీసులు చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అమెరికాలోని సినీమార్క్ అనే మల్టిప్లెక్స్ ఈ నోటీసుని తమ థియేటర్ ముందు పెట్టింది. అమెరికాలోనే ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఉంది అంటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అంటున్నారు అభిమానులు.