థ్యాంక్ యూ మూవీ టాక్..

నాగ చైతన్య , రాశి ఖన్నా , అవికాగోర్‌, మాళవిక నాయర్‌ హీరో, హీరోయిన్లు గా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మించిన చిత్రం థ్యాంక్ యూ. వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న చైతు..ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో ఈరోజు థ్యాంక్ యూ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిక్సిడ్ టాక్ వస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా సినిమా గురించి పలు కామెంట్స్ చేస్తున్నారు.

ఫస్ట్‌హాఫ్ హార్ట్ టచింగ్‌గా సాగుతుందని చెబుతున్నారు. మ్యాజికల్ మూమెంట్స్ చాలా ఉన్నాయంటున్నారు. మూడు వయసుల్లో సాగే పాత్రలో నాగ చైతన్య యాక్టింగ్ ఇరగదీసినట్లు తెలుస్తోంది. చైతూ లుక్ కూడా కొత్తగా ఉందని.. కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందని టాక్ వస్తోంది.

విక్రమ్ కె కుమార్ తన మార్క్ చూపించారని.. ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల హృదయానికి హత్తుకునేలా డిజైన్ చేశారని అంటున్నారు. మూవీ స్టోరీ స్టైట్‌గా సాగుతుందని.. భావోద్వేగాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయంటున్నారు. ఈ సినిమాలో కామెడీ, రొమాన్స్‌తో పాటు ప్రతీ ఒక్కరి జీవితాన్ని తాకే దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు.

ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి విక్రమ్ కే కుమార్ చాలా సమయం తీసుకున్నాడట. పాత్రలను పరిచయం చేయడం.. లవ్ ట్రాక్ చూపించడానికే ఎక్కువ సమయం పట్టిందట. అయితే, సెకెండాఫ్ మాత్రం హీరో పాత్ర చుట్టూనే ఫోకస్ చేశాడట. మొత్తంగా ఇందులో కమర్షియల్ అంశాలు మిస్ అయ్యాయని మరికొంతమంది అంటున్నారు.

నాగ చైతన్య వన్ మ్యాన్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడట. సినిమా మొత్తానికి అతడే ప్లస్ అనేలా నటించాడట. అలాగే, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, నిడివి, మెసేజ్ ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. అయితే, కామెడీ పేలకపోవడం, కథ, కథనం, ఎమోషన్ పండకపోవడం దీనికి మైనస్‌గా మారాయట.