అప్పుడే టైటిల్ మార్చేశారు!

charanబృందావ‌నం క్యాప్షన్‌ని చ‌ర‌ణ్ సినిమాకి పెట్టారోచ్‌….. అంటూ నాలుగైదు రోజుల నుంచీ సోష‌ల్ మీడియాలో ‘గోవిందుడు అందరివాడేలే’ టైటిల్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. ఎన్టీఆర్ క్యాప్షన్ చ‌ర‌ణ్ వాడుకొంటున్నాడు అనే విధంగా ప్రచారం జ‌రిగింది. దాంతో చిత్రబృందంలోనూ కంగారు మొదలైంది. అందుకే ఈ టైటిల్‌ ను ఉన్నప‌లంగా ప‌క్కన పెట్టేశారు. ఈమేర‌కు చిత్రబృందం ఓ ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. మా సినిమా టైటిల్…. అంటూ ఓ పేరు (గోవిందుడు అంద‌రివాడేలే) ప్రచారంలో ఉంది. అయితే ఆ టైటిల్‌ కీ మాకూ ఎలాంటి సంబంధం లేదు. ఇంకా మా సినిమా పేరుని నిర్ణయించ‌లేదు. త్వర‌లోనే మేమే చెబుతాం. అంత‌వ‌ర‌కూ ఎలాంటి వార్తల్నీ న‌మ్మొద్దు అని చిత్రబృందం చెబుతోంది.