మళ్ళీ షూటింగ్ లతో బిజీ కానున్న తెలుగు చిత్ర పరిశ్రమ

కరోనా సెకండ్ వేవ్ తో టాలీవుడ్ కి చాల నష్టం వచ్చిందనే చెప్పాలి. కరోనా మొదటి దశ నుండి కోలుకొని అప్పుడప్పుడే ఒక్కొక్క సినిమా రిలీజ్ చేస్తున్న నిర్మాతలకి కరోనా సెకండ్ వేవ్ దెబ్బకొట్టింది. ఈ మహమ్మారి కారణంగా అన్ని సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గు ముఖం పట్టడంతో ఆగిపోయిన సినిమా షూటింగ్ లను తిరిగి మొదలు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం రాధే శ్యామ్, పుష్ప, థాంక్యూ, ఖిలాడీ, శాకుంతలం ఇంకా మరికొన్ని సినిమాలు మరో ఈ నెల చివరి వారంలో సెట్స్ పై వెళ్తున్నాయి. #RRR, సర్కారు వారి పాట, ఆచార్య వంటి సినిమాలు జులై లో సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు సమాచారం.