అభిమానులను నిరాశ పరిచిన వెంకీ

వెంకటేష్ తన అభిమానులను నిరాశ పరిచారు. రీసెంట్ గా నారప్ప మూవీ తో ఓటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకీ ..ప్రస్తుతం దృశ్యం 2 చేస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తీ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ తరుణంలో ప్రమోషన్లో భాగంగా ఈరోజు ఉదయం ఈ మూవీ తాలూకా మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో అభిమానులంతా ఆ మోషన్ పోస్టర్ కోసం ఎదురుచూస్తుండగా..ఇప్పుడు రిలీజ్ చేయడం లేదంటూ తెలిపి వారికీ ఆగ్రహం కలిగించారు. కొత్త డేట్ ను త్వరలో ప్రకటిస్తారని చెప్పుకొచ్చారు. వెంకటేష్, మీనా జంటగా తెరకెక్కుతున్న ‘దృశ్యం2’ మూవీకి జీతూ జోసెఫ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బాబు దీనిని నిర్మిస్తున్నారు. మరి ఈ మూవీ ని థియేటర్స్ లలో రిలీజ్ చేస్తారో..లేక ఓటిటి లో అనేది చూడాలి.