విజయ్ దేవరకొండ..ప్రస్తుతం వరల్డ్ ఫెమస్ లవర్ తో ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ విశేష ఆదరణ రాగా..ఇప్పుడు ఈ మూవీ లో నటిస్తున్న నలుగురి హీరోయిన్లను రోజుకొకరిని చొప్పున పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే ఇద్దరి హీరోయిన్లను పరిచయం చేసిన చిత్ర యూనిట్..ఈరోజు మూడో హీరోయిన్ కేథరిన్ ను పరిచయం చేసారు.
బొగ్గుగనిలో పనిచేసే యూనియన్ లీడర్ శీను ప్రేమలో స్మిత మేడమ్ ఎలా పడిందన్న కోణంలో వీరి మధ్య లవ్ ట్రాక్ ఉండబోతుంది. రేపు ఫైనల్ హీరోయిన్ రాశిఖన్నా లుక్ రాబోతుంది. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.