ఆస్కార్‌ రేసులో నిలిచిన మన కామ్రేడ్‌

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన డియర్‌ కామ్రేడ్‌ చిత్రాన్ని ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆస్కార్‌ ఎంట్రీ దక్కించుకుంది. ఈ చిత్రంలో ఉన్న కంటెంట్‌ మరియు సందేశం కారణంగా సినిమాను ఆస్కార్‌ రేసులో నిలిపినట్లుగా సమాచారం అందుతోంది. తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పర్చిన డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ఏకంగా ఆస్కార్‌ రేసులో నిలవడం తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు అంతా కూడా ఆశ్చర్య పోతున్నారు. అసలు డియర్‌ కామ్రేడ్‌ ఎందుకు ఆస్కార్‌ బరిలో నిలిచి ఉంటుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కొందరు ఈ విషయాన్ని నిజమనుకోవడం లేదు. కాని ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆస్కార్‌ టీం వారు మొత్తం 28 సినిమాలను ఎంపిక చేయడం జరిగింది. ఈ 28 సినిమాల్లో ఒక్కటైనా ఆస్కార్‌ను దక్కించుకుంటుందా చూడాలి. బాలీవుడ్‌కు చెందిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు నుండి కేవలం డియర్‌ కామ్రేడ్‌ చిత్రానికి మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఆస్కార్‌ రాకున్న పర్వాలేదు అక్కడకు వెళ్లడం చాలంటూ విజయ్‌ దేవరకొండ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.