వాళ్ళకి 25 లక్షల సహాయం అందించిన విజయ్ సేతుపతి

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపించింది, ఇప్పటికే చాలా వరకు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కోలీవుడ్ సెలబ్రిటీలు తమవంతు సాయంగా ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్నారు.

ఇప్పటికే తమిళ సినీ తారలు తల అజిత్, తలపతి విజయ్, ప్రముఖ దర్శకుడు మురుగదాస్, తమిళ స్టార్ హీరో సూర్య ఫామిలీ, జయం రవి ఫ్యామిలీ, శివ కార్తికేయన్, డైరెక్టర్ వెట్రిమారన్, రజనీకాంత్ మొదలగువారు తమవంతు సాయంగా కరోనా రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు అందించారు. తాజాగా హీరో విజయ్ సేతుపతి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను పర్సనల్ గా కలిసి రూ. 25 లక్షల చెక్ ను కరోనా రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు.