చిరు కు విజయ్ దేవరకొండ సపోర్ట్

సినిమా టికెట్ ధర విషయంలో మెగాస్టార్ చిరంజీవి..ఏపీ సీఎం ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియా లో చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటును ఆఫర్ చేసిందంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చిరంజీవి ఆవార్తలను కొట్టిపారేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి, చట్టసభలకు రావటం జరగదని, దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దంటూ.. ఈ వార్తలకి, చర్చలకు ఇక్కడితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ఆయన ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

అంతేకాదు, దీనికి #GiveNewsNotViews అనే హ్యాష్ ట్యాగ్‌ని కూడా జోడించారు. చిరంజీవి పెట్టిన #GiveNewsNotViews హ్యాష్ ట్యాగ్‌కి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘మై ఫుల్ సపోర్ట్’ అంటూ మద్ధతు తెలిపి ట్వీట్ చేశాడు.