విష్ణు ప్రమాణ స్వీకార వేడుకకు తెరాస మంత్రి ముఖ్య అతిధి..?

మా ఎన్నికల్లో ఘన విజయం సాధించి మా అధ్యక్ష పీఠం దక్కించుకున్న మంచు విష్ణు..ఈ నెల 16 న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెల 16 వ తేదీన జరిగే మా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంచు విష్ణు మంత్రిని ఆహ్వానించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన మంచు విష్ణు, ట్రెజరర్ శివ బాలాజీ తలసానితో కలిసి ఫోటో దిగారు.

ఇక తనను గెలిపించిన వారికి మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపిన విష్ణు ఇప్పుడు స్వయంగా అందరీ ఇంటికి వెళ్లి కలుస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, కోట శ్రీనివాస రావు, పరుచూరి బ్రదర్స్ వంటి వారిని కలిసిన మంచు విష్ణు త్వరలోనే చిరంజీవిని కూడా కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటానని వెల్లడించారు. ఈరోజు ఉదయమే తన తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచు విష్ణు బాలయ్యను ఆయన నివాసంలో కలిశారు.