IPL16 : CSK Vs GT – పోరాడి గెలిచిన గుజరాత్ టైటాన్స్


క్రికెట్ అభిమానులకి పండగ మొదలైంది. ఐపిఎల్ 16 వ సీజన్ అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా ఈరోజు మొదలైంది. ప్రారంభ వేడుకలకు అతిరధ మహారధులు వచ్చి సందడి చేసారు. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. ఋతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో 92 పరుగులు చేసి టీం లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుండి దూకుడుగా ఆడింది. శుభమన్ గిల్ 36 బంతుల్లో 63 పరుగులు చేయగా వృద్ధిమాన్ సహా 25, సుదర్శన్ 22, విజయ్ శంకర్ 27, తేవాతియా 15 పరుగులుచేయగా చివర్లో వచ్చిన రషీద్ ఖాన్ 3 బంతుల్లో 10 పరుగులు చేసి టీమ్ ని గెలిపించాడు.