బాబు ఇలా జరిగిందేంటి..?

40 ఇయర్స్ సీనియార్టీ ఏమైంది..? ఆసరా పథకాలు ఏమయ్యాయి..? అభివృద్ధి అనేది ఎక్కడికి వెళ్ళింది..? హామీలు ఏ దారికి వెళ్లాయి..? ఇవే ప్రశ్నలు చంద్రబాబు ను నిలదీస్తున్నాయి. అధికార పార్టీ లో ఉండి..కేవలం 25 స్థానాలకే పరిమితం కావడం తెలుగుదేశం పార్టీ ని కోలుకోకుండా చేస్తున్నాయి. దాదాపు 18 మంత్రులు ఓటమి బాటలో ఉంటె..చంద్రబాబు కుప్పం లో గెలవడం కాస్త ఊరట. లోక్‌సభ నియోజకవర్గాల పరిస్థితి మరీ ఘోరం. ఒకే ఒక్కచోట టీడీపీ ఆధిక్యం కనబరుస్తోంది. ఇంతటి దయనీయ పరిస్థితి తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేదని చెప్పాలి.

బయట రోడ్ల మీద వైఎస్సార్సీపీ కార్యకర్తల సంబరాల్ని చూడలేక, ఆ హోరుని తట్టుకోలేక తెలుగుదేశం నేతలంతా ఇంట్లోనే ఉండిపోయారు. పోలింగ్‌ రోజునే ఫ్యాను గాలిపై వైఎస్సార్సీపీ శ్రేణులకు ఓ అవగాహన వచ్చేసింది. ఇన్ని రోజులపాటు అధికారిక ఫలితం కోసం ఎదురుచూశాక, వారు ఆశించిన ఫలితం వచ్చాక వైసీపీ శ్రేణుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారుతుంది. ఈ నెల 30 న జగన్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తుంటే..ఈరోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయబోతున్నారు.