చంద్రబాబు పందికొక్కు అంటూ కొడాలి నాని ఫైర్..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రోజు రోజుకు వేడి ఎక్కుతున్నాయి..ప్రజల సమస్యలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా ప్రస్తావిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఐదో రోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫై కొడాలి నాని ఘాటైన వాక్యాలు చేసారు. గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మార్షల్స్‌తో వాగ్వాదంపై సభలో ప్రస్తావనకు వచ్చింది.

ఈ సందర్బంగా నాని పలు విషయాలు మాట్లాడుతూ..చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు. జగన్ జైలులో ఉండటానికి కారణాలేంటో ప్రజలకు తెలుసన్నారు నాని. కాంగ్రెస్‌తో విభేదించడం వల్లే జగన్‌పై అక్రమ కేసులు పెట్టారని.. ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారని.. ప్రజలు కూడా 151 సీట్లతో ఘన విజయం అందించారన్నారు. చంద్రబాబులా టీడీపీలోకి పందికొక్కులా దూరి వ్యవస్థను నాశనం చేయలేదన్నారు. బాబు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.