ఏపీలో ఫ్యాన్ ..దేశంలో బీజీపీ జోరు..

సార్వత్రిక ఎన్నికల ఫలితాల లెక్కింపు మొదలు అయ్యింది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా..ఇప్పటి వరకు జరిగిన లెక్కింపు లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ముందంజలో ఉండగా..దేశంలో బీజీపీ జోరు కొనసాగుతుంది. అలాగే మంగళగిరి లో నారా లోకేష్ ముందుంజలో ఉన్నారు. భీమవరంలో పవన్ వెనుకంజలో ఉండగా..గాజువాక లో మాత్రం పవన్ తన దూకుడు ను కనపరుస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం లోక్‌సభ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విశాఖ పార్లమెంటరీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భరత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లోక్ సభ , అసెంబ్లీ చూసుకుంటే..వైకాపా 46 లోక్ సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..తెలుగుదేశం 13 స్థానాల్లో ఆధిక్యం ఉంది.

అలాగే లోక్ సభ చూసుకుంటే వైకాపా , టీడీపీ 5 స్థానాల్లో ఆధిక్యం లో ఉంది. జనసేన , కాంగ్రెస్ , బీజీపీ , ఇతరులు ఎక్కడ కూడా ఆధిక్యంలో కనిపించడం లేదు.