పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ వాయిదా..


ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 14 నుంచి జరగాల్సి ఉన్న 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన PET/PMT ఈవెంట్స్ వాయిదా పడ్డాయి. త్వరలోనే కొత్త డేట్స్ ప్రకటిస్తామని పోలీస్ బోర్డ్ తెలిపింది. ఏపీలో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసు కానిస్టేబుల్ PET/PMT ఫిజికల్ ఈవెంట్లు వాయిదా వేస్తున్నట్టు పోలీస్ రిక్రూట్ మెంట్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని పేర్కొంది. తాజా సమాచారం కోసం తమ వెబ్ సైట్ చూస్తుండాలని తెలిపింది.