ఏపీ పాలిటిక్స్@ టార్గెట్ 2024


ఏపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్నటి వరకు సభలు, సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని ప్రతిపక్షాలు నానా గోలా చేశారు. కానీ ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. ఏపీ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీతో పాటు టీడీపీ, జనసేన,బీజేపీ సైతం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంపై టీడీపీ, జనసేన,బీజేపీ విమర్శల పర్వం కురిపిస్తున్నాయి. వాటికి ఎప్పటికప్పుడు రాష్ట్రమంత్రులు, వైసీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు.

వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఏదో ఒక సమస్యపై విపక్షాలు నానా హంగామా చేస్తున్నారు. ప్రతి సమస్యను భూతద్దంలో పెట్టిమరి ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. వాటికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రతివిమర్శలతో ముందుకు వెళ్తుంది. మూడు రాజధానులతో ప్రారంభమైన వివాదం నేటికి కొనసాగుతునే ఉంది.

బీజేపీ, జనసేన, ,టీడీపీ పొత్తుల కోసం పాకులాడుతుంటే.. వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దీంతో పవన్ కల్యాణ్ బీజేపీ,టీడీపీతో జోడి కట్టేందుకు సిద్ధం అవుతుంటే.. బీజేపీ మాత్రం వాటికి భిన్నంగా తాము కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని కుండ బద్దలు కొట్టాడు. ఇప్పటికే వైసీపీ సర్కార్ సైతం పవన్ కల్యాణ్ ఒంటరిగా ఎన్నికలకు రావాలని సవాల్ విసురుతున్నారు.