ఏపీపీజీసెట్‌ –2021 నిర్వహణ బాధ్యతలు దక్కించుకున్న యోగివేమన యూనివర్సిటీ

ఆంధ్రప్రదేశ్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీపీజీసెట్‌)–2021 నిర్వహణ బాధ్యతలను కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయానికి (వైవీయూ) అప్పగిస్తూ ఏపీ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా వంటి 127 కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ సెట్‌ నిర్వహించనున్నారు. ఏపీ పీజీసెట్‌–2021 చైర్మన్‌గా వైవీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య మునగాల సూర్యకళావతి, సెట్‌ కన్వీనర్‌గా వైవీయూ భౌతికశాస్త్ర ఆచార్యులు వై.నజీర్‌అహ్మద్‌ వ్యవహరించనున్నారు.