ఏపీపీఎస్సీ : గ్రూప్‌–1 పరీక్ష తేదీ ఇదే, హాల్ టిక్కెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి


ఆంధ్రప్రదేశ్ లోని గ్రూప్‌–1 పోస్టుల నియామకానికి సంబంధించిన స్క్రీనింగ్‌ టెస్ట్‌­ను జనవరి 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఎనిమిదో తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్‌–2 పరీక్షలు ఉంటాయని, రాష్ట్రంలోని 18 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని వివరించారు. హల్‌టికెట్లు ఈ నెల 31 నుంచి కమిషన్‌ వెబ్‌సైట్‌లో https://psc.ap.gov.in అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాల జాబితా కూడా వెబ్‌సైట్‌లో ఉంటుందని తెలిపారు.