ఆజాద్ అసంతృప్తి..!

kiran-azadఅధిష్టానం పిలుపుతో ఢిలీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ రాష్ర్ట వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ అంశంతో పాటు రాష్ర్టంలో పార్టీ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. కాగా, ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ, మాజీ మంత్రి శంకర్రావు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆజాద్ అసంతృప్తి వ్యకం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణపై సంప్రదింపుల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సహా పలువురు అధిష్టానం పెద్దలను కలవనున్నారు. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే వీరి భేటీకి సంబంధించి ఇప్పటివరకు సోనియా అపాయింట్ మెంట్ ఖరారు కాలేదని సమాచారం.