మరో హస్తం నేత మద్దతు.. !

batti-vikramarka-fire-on-tr
కేసీఆర్ మంత్రివర్గం వర్గం నుంచి ఉద్వాసనకు గురైన టి.రాజయ్యకు క్రమేపి మద్దతు పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా హస్తం నేతలు రాజయ్యకు అండగా నిలుస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క రాజయ్యకు ఈ జాబితాలో చేరారు. గాంధీభవన్‌లో భట్టి ఈరోజు (మంగళవారం) విలేకరులతో మాట్లాడుతూ.. “తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైందన్నారు. సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని సోనియా తెలంగాణ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రంలోనూ ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయటం అనేది జరిగి ఉండకపోవచ్చన్నారు.

మంత్రివర్గం నుంచి తొలగింపబడిన రాజయ్య.. కేసీఆర్ దేవుడంటున్నాడు. హస్తం నేతలేమో.. కేసీఆర్ దళితుల ద్రోహి అంటున్నారు. రాజయ్యకు లేని బాధ హస్తం నేతలకు ఎందుకో..? అంటే.. రాజయ్యను మళ్లీ హస్తం దరికి చేర్చుకోవాలని ఆశపడుతున్నట్లు కనిపిస్తోంది. మరీ.. రాజయ్య మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతారా.. ? లేదా.. ? గులాభి పార్టీలోనే గుట్టుగా సాగిపోతారా..? అన్నది వేచి చూడాలి.