పవన్ కళ్యాణ్ కి బన్నీ సపోర్ట్


జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ‌ద్దతు ప్ర‌క‌టించారు. ట్విట‌ర్‌ వేదిక‌గా ప‌వ‌న్‌కు మ‌ద్దతు తెలుపుతూ బ‌న్నీ ప్రత్యేకంగా ఓ ట్వీట్ చేశాడు. “మీ ఎన్నిక‌ల ప్రయాణానికి నా హృద‌య‌పూర్వక శుభాకాంక్షలు. సేవ కోసం మీ జీవితాన్ని అంకితం చేయ‌డాన్ని చూసి గ‌ర్విస్తున్నాను. ఒక కుటుంబ స‌భ్యుడిగా నా మ‌ద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు కోరుకున్నది సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నా” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఐకాన్ స్టార్ అభిమానులు కూడా ప‌వ‌ర్ స్టార్‌కు మ‌ద్దతు తెలుపుతున్నారు