పవన్ రావాలి..లెక్క తేలాలి..!

Pawan-praja‘నాకు కొంచెం తిక్క ఉంది ..కానీ దానికో లేక్కుంది’ అని పవన్ ఏ క్షణాన ఆ డైలాగ్ చెప్పాడో కానీ ఇప్పుడు అందరు పవన్ కళ్యాణ్ లెక్క కోసం ఎదురుచూస్తున్నారు…ఎన్నికల సమయం లో పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీ కి మద్దతు ఇచ్చిన సంగతి తెల్సిందే..అప్పటినుండి పవన్ కళ్యాణ్ అంటే తెలుగుదేశం పార్టీలో చాలా విలువ ఉన్నది..అందుకే పవన్ మాట కు గౌరవం ఇస్తారు చంద్రబాబు…ఇది చాల సందర్భాలలో రుజువు అయ్యింది కూడా.

రాజధాని రైతుల భూముల విషయంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవడంతో.. ప్రభుత్వం భూసేకరణకు కాస్త వెనక్కి తగ్గింది. భూసేకరణ జీవో ను వెనక్కి తీసుకున్నది. ఇప్పుడు మళ్లీ పవన్ ప్రశ్నించే టైం వచ్చింది..ఆంధ్రప్రదేశ్ ను కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశాలు చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే..ఈ కాల్ మనీ లో తెలుగు దేశానికి సంబదించిన ఎం.ఎల్.ఏ లు , మంత్రులు ఉండడం తో ప్రభుత్వం కాస్త వెనుకడుగు వేస్తుందని అంటున్నారు..

అందుకే పవన్ అయితేనే ఈ కాల్ మనీ కి ఓ పరిష్కారం చేయగలడని భాదితులు నమ్ముతున్నారు.. పవన్ ప్రశ్నించినపుడే.. ప్రభుత్వం నుంచి పరిష్కారం వస్తుంది వస్తుందని వారు చెపుతున్నారు..మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చి ఈ కాల్ మనీ ఫై ప్రశ్నిస్తాడో చూడాలి.