‘మహాకూటమి’కి సీపీఐ డెడ్ లైన్ !

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, టీజె ఎస్, సీపీఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం లక్ష్యంగా మహాకూటమి ఏర్పడింది. ఐతే, ఈ కూటమిలో సీట్ల పంపకంపై ఇంకా స్పష్టతరావడం లేదు. టీడీపీ, టీజెఎస్, సీపీఐ ఈ మూడు పార్టీలు కాంగ్రెస్ ప్రతిపాధించిన సీట్లకి మరో కొన్ని సీట్లని అదనంగా అడగడమే కారణమని తెలుస్తోంది.

ఎన్నిసార్లు చర్చలు జరిగినా.. సీట్ల పంపకంపై క్లారిటీ రాకపోవడంపై టీజె ఎస్, సీపీఐ అంసతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ మహాకూటమికి డెడ్ లైన్ విధించింది. రెండుమూడ్రోజుల్లో సీట్ల పంపకంపై స్పష్టత రాకుంటే మా దారి మేము చూసుకొంటాం. సీపీఐ పోటీ చేసే 9 హుస్నాబాద్, బెల్లంపల్లి, పినపాక, ఆలేరు, దేవరకొండ, వైరా, మునుగోడు, కొత్తగూడెం, మంచిర్యాల స్థానాలకు అభ్యర్థులని ప్రకటిస్తామని ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.