పర్యాటక రంగంపై సీఎం జగన్ సమీక్ష సమావేశం

ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పర్యాటక రంగానికి ఏపీ చిరునామా కావాలని, నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏపీ పర్యాటకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా పలు ప్రాజెక్టులకు SIPB ఆమోదం తెలిపింది. వివిధ ప్రాజెక్టుల పై రూ. 2868 కోట్ల పెట్టుబడులు, తద్వారా 48 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏపీలో పలు చోట్ల ఒబెరాయ్, తాజ్ వరుణ్, హయత్ హోటళ్లు, విశాఖలో స్కైటవర్ నిర్మితం కానున్నాయి.