తీన్మార్ మల్లన్న గెలుపును ఖరారు చేసిన కేసీఆర్

‘తెలంగాణలో ఎన్నికలు ఏవైనా తెరాసదే గెలుపు’. ఇది దుబ్బాక ఉప ఎన్నిక ముందు వరకే. ఆ తర్వాత మాత్రం ఎన్నికలేవైనా తెరాసకు తప్పదు ఓటమి అన్నట్టుగా తయారైంది. గ్రేటర్ ఎన్నికల్లో గులాభి పార్టీకి షాక్ తప్పలేదు. రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లోనూ.. మరోసారి గులాభి పార్టీ గూబ గుయ్ మనిపించేందుకు రెడీగా ఉన్నారు.

ఈ విషయం సీఎం కేసీఆర్ కు ముందే తెలిసిపోయినట్టుంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి మరోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరుని ఖరారు చేశారు. ఈ స్థానం నుంచి డేరింగ్ డాషింగ్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న , ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి, డాక్టర్ చెరుకు సుధాకర్ , రాణి రుద్రమ రెడ్డి, బీజేపీ నుండి గుజ్జుల ప్రేమిందార్ రెడ్డి లాంటి వారు బరిలో ఉన్నారు. వీరిలో తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమనే టాక్ ఉంది. దీంతో అభ్యర్థిని మార్చిన ఓటమి తప్పదని డిసైడ్ అయిన సీఎం కేసీఆర్ మరోసారి పల్లాకే ఛాన్స్ ఇచ్చారనే టాక్ మొదలైంది.

నిజానికి ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈసారి పోటీ చేయొద్దని భావించాడు. ఈ క్రమంలోనే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బరీలో ఉండాలని కేసీఆర్ తో పాటు పార్టీ పెద్దలు ఒప్పించారు. అప్పటికి పల్లా అన్యమనస్కంగానే పోటీకి ఒప్పుకున్నట్లు వినికిడి. ఇందుకోసం ప్రభుత్వం అప్పటికప్పుడు 50 వేల నోటిఫికేషన్లు, పిఆర్సీ లాంటి తాయిలాలు ప్రకటించింది. కానీ ప్రభుత్వ మోసపు ప్రకటనలను పట్టా భద్రులు ఇప్పటికే గుర్తించడంతో అధికార పార్టీ అభ్యర్థికి ఓటమి తప్పదని పలువురు చర్చించుకుంటున్నారు.

దీనికి తోడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారంలో 14 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని డాంభీకాలు చెప్పుతుందడడం మరింత మైనస్ గా మారింది. ఇలా చేయని పనులు చేసినట్లు చెప్పుకోవడంతో పాటు పల్లా ప్రచారంలో అడుగడుగున పట్టా భద్రులు ఉద్యోగుల నుండి నిరసనలు ఎదురవుతున్నాయి. మొన్నటికి మొన్న ఔట్ సోర్సింగ్ మహిళ ఉద్యోగి మాకు ఉద్యోగ భద్రత కల్పించండని కొంగ్గు చాపి ఆడుకొవడం బట్టి చూస్తే పల్లా గెలుపు కలగానే ఉంది. ఉన్నది ఉన్నట్లు చెప్పాలంటే పల్లా గెలుపుకు దూరంగా ఓటమికి అతి దగ్గరగా ఉన్న మొదటి అభ్యర్థి అని చెప్పొచ్చు.

ఇక బరిలో ఉన్న మరో అభ్యర్థి కోదండరాం రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చెర్మన్ గా వ్యవహరించిన అనే ఒకే ఒక సెంటిమెంటును నమ్ముకుని కోదండరాం బరిలోకి దిగాడు. అయితే పార్టీ పెట్టి ఏ మాత్రం ప్రభావం చూపని కోదండరాం కి ఉద్యోగ సంఘాల బలం కలిసొస్తుందని భావిస్తున్నాడు. అయితే టిఆర్ఎస్ పార్టీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్న విషయం బయట పడింది.. దీనికి తోడు 7 ఏళ్లలో కోదండరాం పెద్దగా జనం సమస్యల మీద కొట్లాడింది లేదు.

పైగా గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మెజార్టీ పెంచడంలో కోదండరాం తెర వెనుక పని చేశాడనే అపవాదు ఉంది. ఇప్పుడు కూడా అధికార పార్టీ అభ్యర్థితో కుముక్కు ఐయ్యడని వినిపిస్తుంది. అదే విధంగా కోదండరాంకి సపోర్ట్ చేసిన కపిలవాయి దిలీప్ కుమార్ , గురజాల రవీందర్ కూడా దూరంగా ఉంటున్నారు. దింతో ఎన్నికల్లో కోదండరాం ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అంటున్నారు.

ఇక బరిలో ఉన్న తీన్మార్ మల్లన్న గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఇంత చర్చ జరగడానికి ఈ డాషింగ్ జర్నలిస్ట్ పోటీ చేస్తుండడమే ప్రధాన కారణం. అందరి కంటే ముందే గ్రౌండ్ లెవల్ లో ప్రచారం చేయడం. అధికార పార్టీకి రోజు ముచ్చెమటలు పట్టిస్తుండం… నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యల మీద నిత్యం గళం వినిపిస్తుండడం తీన్మార్ మల్లన్న ఫెవరేట్ గా మారిపోయాడు. తెలంగాణ వచ్చిన నాటి నుండి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ సంపదను లూటీ చేస్తున్న విధానాన్ని సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో చెప్పడంలో విజయం సాధించాడు.

ఆయన ప్రభుత్వం మీద పోరాడుతున్న తీరుకు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. అంతే కాదు ప్రశ్నించే గొంతుగా పేరు తెచ్చుకున్న మల్లన్న మీద ప్రభుత్వం కుట్ర పూరితంగా 21 కేసులు పెట్టింది. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ప్రజల సమస్య మీద దూసుకుపోతుండడంతో జనం మల్లన్నకే ఓటు అని ముక్తకంఠంతో చెప్పుతున్నారు. మరికొందరు అయితే కేసీఆర్ కి బుద్ది చెప్పాలంటే అది మల్లన్న వల్లే సాధ్యం.. ఆయన చట్ట సభల్లో ఉంటే మరింతగా ఎక్కువగా పోరాడే అవకాశం ఉంటుందని అందుకే తీన్మార్ మల్లన్నకు ఓటు వెయ్యాలని ఫిక్స్ అయ్యారని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి తోడు మల్లన్న మేనిఫెస్టో అందరిని ఆలోచింప చేస్తుంది.

అవినీతి లేని పాలన, రిఫరెడం అని తీన్మార్ మల్లన్న చెపుతున్న అంశాలు ప్రజల్లో చర్చగా మారింది. తాను ఏ పదవిలో ఉన్న ఒంటి మీద బట్టలు తప్పా ఒక్క రూపాయి దోచుకొనని హామీ ఇస్తున్నాడు ఇక రిఫరెడం అనే మరో కొత్త రాజకీయ వాగ్దానం కూడా సంచలనం గా మారింది. అసలు రిఫరెడం అంటే ఏంటి అనేది చర్చగా మారింది. రిఫరెడం అంటే పాలన మీద ప్రజా అభిప్రాయ సేకరణ అని అర్థం. ఈ విధంగా మల్లన్న తన పాలన మీద ప్రజల చేతికి నిర్ణయాధికారం ఇవ్వబోతున్నాడు.

ఈ విధానం ప్లాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో మాత్రమే ఉంది. దీన్ని మల్లన్న ఈ దేశంలో ప్రవేశ పెట్టబోతున్న అని వాగ్దానం ఇస్తున్నాడు. ఒక్కసారి ఎన్నికైన అభ్యర్థిని 5 ఏళ్ళ వరకు ఏం చేయలేము కానీ రిఫరెడం అనే విధానం ద్వారా తీన్మార్ మల్లన్న ప్రజల చేతిలో అధికారం పెట్టబోతున్నడు. గెలిచిన తర్వాత మూడేళ్లకు తన పాలన ఎలా ఉంది తను ప్రజలకు చెప్పినట్టుగా పాలన చేస్తున్నానా అని తనకు తాను రిఫరెడం విధించుకుని ప్రజల ముందుకు వస్తా అంటున్నాడు. ఇలా తీన్మార్ మల్లన్న తనదైన మార్క్ తో పట్టా భద్రుల ఎన్నికల్లో గెలుపు వాకిటలో ఉన్నాడని అంతా అంటున్నారు.

ఎమ్మెల్సీ బరిలో ఉన్న మరో అభ్యర్థి చెరుకు సుధాకర్ . ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా పిడి యాక్ట్ కింద జైలుకు పోయిన నాయకుడిగా చెరుకు సుధాకర్ సింపతి ఓట్ల మీద ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రభావం పెద్దగా కనిపించడం లెదని అంటున్నారు. మరో వైపు చెరుకు సుధాకర్, కోదండరామ్ లాంటి వారు తీన్మార్ మల్లన్నకు మద్దత్తు ఇస్తే బాగుంటుందని పట్టా భద్రులు చెప్పుతున్నారు. అదే విధంగా బరీలో ఉన్న మరో అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమిందార్ రెడ్డి పోటీలో ఉన్న నామ మాత్రమే అన్నట్టు ఉంది.