రైతులకు రుణాలివ్వండి : సీఎం

cm-in-bankars-meetingజూబ్లీహాల్ లో ఈరోజు (శనివారం) రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ర్ట ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత పేదలకు పెద్ద ఎత్తున సాయం చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుల రుణాలకు బ్యాంకర్లు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వటంతో పాటు, ఫౌల్ట్రీ రంగాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు సోలార్ పంపుసెట్లు అందచేస్తామని తెలిపారు. కాగా స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వని బ్యాంకర్లపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి కౌలురైతులకు రుణాలు ఇవ్వని బ్యాంకర్లపై మండిపడ్డారు. కౌలు రైతులకు బ్యాంకులు ఖచ్చితంగా ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ అందించాల్సిందేనని ఆదేశించారు.