స్వామి పరిపూర్ణానందపై ఈసీకి ఫిర్యాదు

ఇటీవలే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనపై దక్షిణాన బీజేపీ అభివృద్ధి చేసే బాధ్యతలని మోపినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే స్వామిలోరు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నల్గొండలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పరిపూర్ణానంద ఆకట్టుకొనే ప్రసారం చేశారు.

ఈ ఫోలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక్కొక్కరికీ రూ.200 ఇస్తే వేల ఓట్లు పడతాయంటూ పరిపూర్ణానంద అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా టీఆర్ ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పరిపూర్ణానంద ఓటర్లని ప్రలోభ పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్వామిలోరుపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇక, గతంలో పరిపూర్ణానంద హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. రాముడు, రామాయణంపై సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకి నిరసనగా స్వామిలోరు హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు పాదయాత్ర చేపట్టేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు సాకుగా చూపుతూ ఆయన్ని హైదరాబాద్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే.