ఉద్యోగుల సర్థుబాటుపై స్పెషల్ ఫోకస్

telangananewdist2
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరుకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు నుంచి చెబుతున్నట్టుగా.. ఈ దసరా నుంచే కొత్త జిల్లాలు అందుబాటులోనికి రావడానికి సర్వం సిద్ధమైంది. అయితే, కొత్త జిల్లాలు ఏర్పాటయితే సిబ్బంది కొరత తలెత్తుతుందని భావించిన ప్రభుత్వం ఆ దిశగా ఫోకస్ చేసింది.

కొత్త జిల్లాల్లో సిబ్బంది సర్దుబాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ దృష్టి సారించారు. శాఖల వారిగా సమీక్ష నిర్వహిస్తున్నారు. దసరా నుండి కొత్త జిల్లాలలో పనులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాధారణ పరిపాలన, న్యాయశాఖ, హోం, ఆర్ధిక, ఐటీ, సమాచార పౌరసంబంధాలు, సంక్షేమ శాఖల పరిధిలో ఉద్యోగుల సర్థుబాటుపై ఫోకస్ చేశారు. మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. మొత్తానికి.. కొత్త జిల్లాల ఏర్పాటు, ఏర్పాటైన కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కొరత ఏర్పడకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటోంది.