డీకే అరుణ్ రాజీనామా.. కేసీఆర్ తో భేటీ

DK_Aruna
కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే. అరుణ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారమ్. కొన్నాళ్లుగా ఆమె మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల్ ని జిల్లాగా ప్రకటించాలని పోరాటం చేస్తోన్న విషయం తెలిసిందే. స్థానికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలని తీవ్ర తరం చేసినా.. గద్వాల్ జిల్లాగా చేసే విషయాన్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు.ఇప్పుడు కొత్త జిల్లాల అంశం తుది అంకానికి చేరుకొంది. దసరా నుంచి కొత్త జిల్లాలు అమలులోని రానున్నాయి. ఈ నేపథ్యంలో డీకే అరుణ కఠినమైన నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది.

గద్వాల్ ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు డీకే రెడీ అయ్యారు. శనివారం ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలసి గద్వాల్ జిల్లా ఏర్పాటుపై లేఖ అందజేయనున్నారు. అనంతరం స్వీకర్ మధుసుదనాచారిని కలిసి తన రాజీనామా లేఖని అందజేయనున్నారు. గద్వాల్ జిల్లా ఏర్పాటు కోసం డీకే ఎమ్మెల్యే పదవీని త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు డీకే అరుణ్ రాజీనామా వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టేలా ఉంది. కొత్త జిల్లాల అంశం చిట్టచివరి దశకు చేరుకొంది. కొద్దిరోజులు ఈ వ్యవహారం ప్రశాంతంగా ముగిసిపోతుందనే భావనలో తెరాస ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో.. డీకే అరుణ్ రాజీనామా లేఖాస్త్రాన్ని ప్రయోగించడం టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యవహారమే. ఆమె ఆదర్శంగా తీసుకొని.. మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు కొత్త జిల్లాల డిమాండ్ పై రాజీనామా వైపు అడుగులు వేయనున్నారు. ఈ పరిణామం వరంగల్ జిల్లా జనగాం లాంటి కొత్త జిల్లాల ఏర్పాటు డిమాండ్ అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలని మరింత ఇబ్బంది పెట్టనుంది. దీంతో.. కొందరు టీఆర్ ఎస్ ఎమ్మెల్యే లు కూడా సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు కలపవస్తోంది. మొత్తానికి.. డీకే అరుణ్ కేసీఆర్ ప్రభుత్వానికి కొత్త చిచ్చు తెచ్చిపెట్టారు. ఇది కారుచిచ్చి కాకుండా కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి అస్త్రాలని ప్రదర్శిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.