అరుణ బొమ్మాలి.. కేసీఆర్ పశుపతి

kcr

తెలంగాణ రాష్ట్ర సమితి నేత, నిజామాబాద్‌ ఎంపీ కవిత, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డికె అరుణకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న డికె అరుణని ఉద్దేశించి ‘బొమ్మాళీ.. ఇంట్లో కూర్చో..’ అని కవిత కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడీ కామెంట్ పై కౌంటర్ ఇచ్చారు అరుణ. ”నేను బొమ్మాళీని అయితే, మీ నాన్న కేసీఆర్‌ పశుపతి అవుతాడా.?’అని కౌంటర్ ఇచ్చారు అరుణ. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జిల్లాలు ఏర్పాటు చేయడం సరికాదని హితవు పలికారు అరుణ.

ప్రస్తుతం గద్వాలను జిల్లాగా చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు చేపడ్తున్నారు డీకే అరుణ. దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌కీ అరుణకీ మధ్య రాజకీయ రచ్చ మొదలైయింది.