విశాఖలో రెండు రోజుల పాటు అట్టహాసంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌


ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ జరగనుంది. రెపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ లో దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. దేశ వ్యాప్తంగా ప్రముఖ పారిశ్రమిక వేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పోరేట్ సంస్థలకు విశాఖ ఆతిధ్యం ఇవ్వనుంది. పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించనున్నారు.

ఇక ఈ సమ్మిట్ కోసం జీఐఎస్‌ కోసం ప్రత్యేక అతిథులుగా కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమారమంగళం బిర్లా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఎండీ, సీఈవో సంజీవ్‌ బజాజ్, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ నవీన్‌ జిందాల్, జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ గ్రంధి మల్లిఖార్జునరావు, రెన్యూ పవర్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుమంత్‌ సిన్హా, దాల్మియా భారత్‌ గ్రూప్‌ ఎండీ పునీత్‌ దాల్మియా , సైయెంట్‌ ఫౌండర్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, సెంచురీ ప్లేబోర్డ్స్‌ చైర్మన్‌ సజ్జన్‌ భజాంక, గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ ప్లానెట్‌ సెక్రటరీ జనరల్‌ సత్య త్రిపాఠి, పెగాసస్‌ క్యాపిటల్‌ ఫౌండర్‌ సీఈవో క్రైగ్‌ కాట్, పార్లే ఫర్‌ ది అడ్వైజర్స్‌ ఓషన్స్‌ సిరిల్‌ గచ్, శ్రీ సిమెంట్‌ చైర్మన్‌ మోహన్‌ బంగర్, ఒబెరాయ్‌ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అర్జున్‌ ఒబెరాయ్, టెస్లా కో¸ఫౌండర్ మార్టిన్ ఎబర్‌హార్డ్, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా తదితరులు పాల్గొనబోతున్నారు..