‘ఏ. పి’ లాజిస్టిక్ హబ్ – గవర్నర్ నరసింహన్

Gov-Narasimhan-speaksవిజయవాడలోని ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జాతీయజెండాను ఆవిష్కరించి కీలకోపన్యాసం చేశారు. ఆంధ్రభూమిలో పుట్టడం ఎంతో పుణ్యఫలమని, ఆంధ్ర ప్రజానీకానికందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అంతే కాకుండా ఆంధ్ర రాష్టానికి సంబదించిన కొన్ని కీలకాంశాలు గవర్నర్ ప్రసంగించారు..అవి ఏంటో ఓసారి మనం చూద్దాం…

1 ) రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్ గా తీర్చడం..
2 ) స్మార్టు విలేజ్, స్మార్టు వార్డు స్మార్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యం
3) గోదావరి పుష్కరాలు ఘనంగా ఏర్పాటు చేయడం
4) పరిశ్రమల ఏర్పాటు కోసం సింగిల్ డెస్క్
5) చిత్తూరు లో మెగా పార్క్
6) మార్చి 31లోగా అన్ని శాఖల్లో ఈ గవర్నెన్స్
7) కొత్త రాజధానికి జపాన్ సహకారం అందిస్తుందని చాలా ఆనందదాయకం
8) కృష్ణపట్నం వద్ద త్వరలో 16 మెగావాట్ల ధర్మల్ విద్యుత్
9) పోలవరం కాలువ నిర్మాణం పనులు 50 శాతం పూర్తయ్యాయి. పోలవరం నిర్మాణంపై ఇరుగు రాష్ట్రాలతో చర్చలు జరిగాయి.
10) ఎస్సీ ఎస్టీ అభివృద్ధికి నిరంతరం ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది
11) సాంఘీక సంక్షేమం వసతి ఏర్పాట్ల సహకారానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి