నేడు గుజరాత్ శాసనసభ రెండవ దఫా ఎన్నికల నామినేషన్ పత్రాల పరిశీలన


గుజరాత్ శాసనసభ రెండవ దఫా ఎన్నికల నామినేషన్ పత్రాల పరిశీలన ఈ రోజు జరుగుతుంది. అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ లోగా తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. డిసెంబర్ 5న ఈ రెండవ దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. కాగా మొదటి దశ ఎన్నికలకు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి గడువు నిన్నటితో ముగిసింది. ఈ దశలో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ప్రకటించాల్సి ఉంది. మొదటి దశ ఎన్నికల్లో మొత్తం 182 శాసనసభ స్థానాలకు గాను, 89 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.