ముచ్చటగా మూడోసారి నటాషాను మనువాడిన హార్దిక్‌ పాండ్యా..


టీమిండియా స్టార్‌ ఆటగాడు హార్దిక్‌ పాండ్యా- నటాషా స్టాంకోవిక్‌ ముచ్చటగా మూడోసారి పెళ్లిపీటలెక్కారు. తాజాగా ఉదయ్‌పూర్‌లో గురువారం రాత్రి హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మధ్య వేదమంత్రాల సాక్షిగా వీరి వివాహం ఘనంగా జరిగింది. అంతేకాదు వాలెంటైన్స్ డే సందర్భంగా 2023 ఫిబ్రవరి 14న ఈ జంట క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో మరోసారి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

ఇక ఈ గ్రాండ్ వెడ్డింగ్‌ అనంతరం పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు హార్దిక్‌- నటాషా. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

కాగా మూడేళ్ల క్రిత‌మే పాండ్యా- న‌టాషా వివాహం జరిగింది. కరోనాతో పాటు అప్పటి పరిస్థితులను బట్టి ఈ జంట సాదాసీదాగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. అనంతరం వీరికి ఓ కుమారుడు అగస్త్య జన్మించాడు.