కేసీఆర్ సర్కార్ స్పీడు కు హైకోర్టు బ్రేక్

kcr

హైదరాబాదులో వర్షాలు ముంచెత్తడంతో జన జీవనం స్తంభించిన సంగతి తెలిసిందే . ఈ వర్షాలపై రివ్యూ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమ కట్టడాలు కూడా ఈ పరిస్థితికి కారణమని వెంటనే అక్రమ కట్టడాలను కూల్చివేయాలని జీహెచ్ఎంసీ కి అదేశించారు. ఈ నేపధ్యంలో కుల్చివేతలకు దిగింది జీహెచ్ఎంసీ.

అయితే ఇప్పుడీ విషయంలో జీహెచ్‌ఎంసీకి హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. అక్రమ నిర్మాణాలు కూల్చేముందు వాటి యజమానులకు నోటీసులు జారీచేయాలని సూచించింది. ఆ కట్టడాలపై వివరణ ఇచ్చేందుకు నిర్మాణదారులకు మూడు వారాల గడువు ఇవ్వాలని , గడువు ముగిశాక ఎందుకు కూల్చివేస్తున్నారో ఉత్తర్వుల్లో వివరణ ఇచ్చి కూల్చివేయాలని సూచించింది.

జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు నిర్మాణదారులకు అందేవరకు కూల్చివేతలు చేపట్టవద్దని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.