తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

telangana-stateతెలంగాణలో నంబర్ ప్లేట్ల రీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రవాణాశాఖలకు పలు సూచనలు చేసింది. రిజిస్రేషన్ల పేరిట పౌరులను వేధించవద్దని… చట్టాన్ని రూపొందించకుండా పాత రిజిస్ట్రేషన్లు ఎలా మారుస్తారు అని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహారిస్తే కుదరదని హైకోర్టు హెచ్చరించింది.