తెలంగాణ సర్కార్‌కు కోర్టు అక్షింతలు…!

Telangana-Stateతెలంగాణ ఏర్పడిన తరువాత విద్యార్థుల ఫీజు విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేసిన గందర గోళానికి కెసిఆర్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనుకోవాలి. హైకోర్టు ఫాస్ట్‌ పథకాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. అంతేకాదు తెలంగాణ భారత దేశంలో అంతర్భాగం. ఇదేమి వేరే దేశం కాదు అని అక్షింతలు వేసింది. నిజానికి అసలు ఈ పథకం రాజ్యాంగం ప్రకారం చాలా భిన్నమైంది. దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు…దయచేసి ఈ విషయంలో పునరాలోచించుకోవాలని చురకలంచింది. మరోవైపు వాహనాల నెంబర్‌ ప్లేట్ల విషయంలో కూడా ఎదురు దెబ్బ తగిలింది. నెంబర్‌లకు ముందు టీఎస్‌ చేర్చాలన్న దానికి కూడా కోర్టు అభ్యంతరం తెలిపింది. అసలు ఏవిధంగా వాహనాల రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారని సూటిగా ప్రశ్నించింది. దీనితో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదం కావడంతో కెసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురు చూస్తున్నారు.