’మామ్’ విజయవంతం!

mam
భారత అంతరిక్ష పరిశోధనలో ఛారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకొంది. రోదసిలో 10నెలల ప్రయాణం అనంతరం మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ (మామ్) అరుణ గ్రహంలోకి ప్రవేశించి విశ్వవినువీధుల్లో భారత జాతీయ పతాకను సగర్వంగా ఎగరవేసింది. ఈరోజు ఉదయం తెల్లవారు జామున 4.17ఉపగ్రహ యాంటెన్నాను ఇస్రో మళ్ళించింది. ఉదయం 7.27మార్స్ ఆర్బిటర్ మిషన్ లామ్ ను మండించారు. నిర్ధేశిత సమయం ప్రకారం 24 నిమిషాల పాటు ద్రవ ఇంజన్లు మండాయి. దీంతో.. సెకనుకు 22.1 కి.మీ. నుంచి క్రమంగా 4.4 కి.మీ మామ్ తగ్గి అరుణ గ్రహంలోకి కక్ష్యలోకి చేరుకొంది. బ్యాలాలోని డీప్ స్పేస్ సెంటర్ నుంచి మామ్ కదలికలను పరిశీలించారు. కాగా, మధ్యాహ్నం 12.30గంటలకు మామ్ నుంచి తొలి చిత్రం అందనుంది.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. శాస్త్రవేత్తలకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. మామ్ విజయవంతం కావడం పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయం చరిత్రాత్మక ఘట్టమని ఆయన అభివర్ణించారు.