పవన్ కళ్యాణ్ ‘జనసేన పార్టీ’ రద్దు ?

pawankalyan-janasena-raddu

పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్న ‘జనసేన పార్టీ’ రద్దు అంశం తెరపైకి వచ్చింది. జనసేన పార్టీని రద్దు చేయాలంటూ ఏపీ బీసీ సంఘం డిమాండ్ చేస్తోంది. ప్రశ్నించాల్సిన పవన్ ఎక్కడ ? ప్రజలకు న్యాయం జరగని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానంటూ.. పార్టీ ఆవిర్భావ సమయంలో గొప్పలు చెప్పిన పవన్ .. రాష్ట్రంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా, సంక్షేమ పథకాలు అందక ప్రజలు ఆందోళన చెందుతున్నా స్పందించడం లేదని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా ఉన్నందున జనసేన పార్టీని ఎన్నికల సంఘం రద్దు చేయాలని డిమాండ్ ఆయన చేశారు. బీసీ సంఘం చేసిన డిమాండ్ కి వైసీపీ కూడా
సంపూర్ణ మద్దతుని ఇచ్చే అవకాశం ఉంది.