బస్సెక్కిన రాహుల్ గాంధీ.. ఏం చేశారంటే !


కర్ణాటక రాజకీయం తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం పూర్తి కావొస్తుంది. దీంతో కర్ణాటకలో అధికారం కోసం అన్ని పార్టీల నేతలు సర్వశక్తులు ఒడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో బీజేపీ , కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా – నేనా అన్నట్టుగా ముందుకుసాగుతుంది.

ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విషయంలో సరికొత్త దారిలో అడుగులు ముందుకి వేస్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో పాటు నేరుగా జనంలోకి రాహుల్ వెళ్తున్నారు. నిన్న స్కూటీపై డెలివరీ బాయ్ తోపాటు వెళ్లి ప్రచారం నిర్వహించిన రాహుల్.. ఈ రోజు బెంగళూరు సిటీ బస్సులో ప్రయాణిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

రాహుల్ గాంధీ తొలుత కన్నింగ్ హామ్ రోడ్డులో ఉన్న‘కేఫ్ కాఫీ డే’లో కాఫీ తగిన వెంటనే, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ బస్ స్టాప్ కు వెళ్లి, కాలేజీ స్టూడెంట్లు, మహిళా ఉద్యోగులతో కాసేపు ముచ్చట్టించారు. తర్వాత బస్సులో ప్రయాణించారు. మహిళలు, కాలేజీ విద్యార్థులతో రాహుల్ మాట్లాడారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై, అలాగే గృహలక్ష్మి, బీఎంటీసీ, కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పలు రకాల పథకాల గురించి వారికి వివరించారు. ఆ తర్వాత లింగరాజపురం వద్ద రాహుల్ గాంధీ బస్సులో నుండి దిగేసారు. మొత్తంగా ఎవరికి వారు ఓటర్లని ఆకట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.