ఆంధ్రాలో వెలసిన కేసీఆర్ ఫ్లెక్సీ.. !!

kcr-flexi
టీ-మంత్రి కేటీఆర్ అన్న మాటలు నిజం అయ్యేలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్ )ను ’తెలుగు రాష్ట్ర సమితి’గా మార్చి ఆంధ్రాలోనూ పోటీ చేస్తామని, నేను భీమవరం నుంచి పోటీ చేస్తానని కేటీఆర్ సరదాగా సంభాషించిన విషయం తెలిసిందే. తాజా పరిణామలను చూస్తే.. ఆంధ్రాలోనూ టీఆర్ ఎస్ ఆధరణ లభించేలా కనబడుతోంది. ఆంధ్రాలో తెరాస అధినేత కేసీఆర్ ఫ్లెక్సీలు వెలిస్తున్నాయి.

తాజాగా, తూర్పుగోదావరి జిల్లాలో కేసీఆర్ ఫ్లెక్సీ వెలిసింది. తూ.గోదావరి  జిల్లా వై. రామవరం మండలానికి చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్లెక్సీలో కేసీఆర్ కి శతకోటి అభినందనలు తెలిపారు. ఈ ఫ్లెక్సీ తెదేపా నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. స్థానిక తెదేపా నేతలు పంచాయతీ కార్యదర్శికి చెప్పి ఫ్లెక్సిని తొలగించాలని సూచించారు.