కొత్త పార్టీ ఖాయమేనా?

Kiran-KumarReddyముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. పార్టీ కోసం విస్తృతంగా కసరత్తు జరుగుతోందంటు కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. సమైక్యాంధ్ర నినాదంతో ముందుకు వెళ్లడానికి కిరణ్ సిద్ధమౌతున్నాడన్న అనుమానం రాజకీయ వర్గాల్లో కూడా ప్రారంభమైంది. దీంతో ముఖ్యమంత్రి పార్టీ పెడితే తమ నెత్తిన పాలు పోసినట్లేనని సీమాంధ్ర కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కిరణ్‌ అండగా నిలబడడానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్ధమౌతున్నారు.