టీడీపీలో కలకలం లేపుతున్న కొడాలి నాని, హరికృష్ణ

kodali-harikrishnaనందమూరి హరికృష్ణ మరోసారి టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారాడు. వైసీపీ నేత కొడాలి నానితో హరికృష్ణ ఒకే కార్ లో విజయవాడకు రావడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. విజయవాడలో జరిగిన వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో హరికృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హరికృష్ణ తో నాని కలిసి రావడం చర్చకు దారితీసింది.

హరికృష్ణ ,ఎన్టీఆర్ లకు కొడాలి నాని అత్యంత సన్నిహితుడు. అయితే టీడీపీని వీడి వైసీపీలో చేరిన తర్వాత ఎక్కడా కూడా వీరితో కనిపించిన దాఖలాలులేవు. ఇప్పుడు వీరిద్దరూ ఒకేసారి హాజరుకావడం అందరిలో ఆశ్చర్యం కలిగించింది.