కేసిఆర్ కు కోదండ సైలెంట్ వార్నింగ్

kcr

రైతులకు సంఘీభావంగా అక్టోబర్‌ 2న మౌనదీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ ప్రకటించారు. ‘తెలంగాణ రైతుల దుస్థితి- కరవు, పంట రుణాలు’ అంశంపై హైదరాబాద్‌లో తెలంగాణ రైతు జేఏసీ చేపట్టిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి కోదండరామ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోదండ.. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ రంగంపై ఒక రోజంతా చర్చించాలని డిమాండ్‌ చేశారు. కొత్త వ్యవసాయ విధానాన్ని వెంటనే ప్రకటించాలని కోరారు. రైతులకు పంట రుణాలు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబర్‌ 2 తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకుని , తర్వాత ‘చలో హైదరాబాద్‌’ పిలుపు ఇవ్వనున్నట్లు చెప్పారు కోదండరామ్‌.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర సాధన తర్వాత ఆయన్ని పక్కన పెట్టేసినట్లుగా స్పష్టంగా కనిపించింది. ఐతే తర్వాత జేఏసీ ఛైర్మన్ గా మళ్ళీ యాక్టివ్ అయ్యారు కోదండరామ్‌. ఇప్పటికే కేసిఅర సర్కార్ పై పలు సందర్భల్లో అసంతృప్తి వెళ్లగక్కారు. ఇప్పుడు సరిగ్గా గాంధీజయంతి రోజున గాంధీమార్గంలో కోదండరాం చేపడుతున్న మౌన దీక్ష కేసీఆర్ సర్కారుకు ఒక సైలంట్ హెచ్చరిక గా అభిప్రాయపడుతున్నారు పలువురు.