మహాకూటమి పుంజుకొవడంపై కేటీఆర్ కామెంట్

తెలంగాణలో వార్ వన్ సైడ్ అనుకొన్నారు. కేసీఆర్ ముందస్తు వెళ్తున్నట్టు ప్రకటించిన సమయంలో పరిస్థితులు అలాగే కనిపించాయి. దీంతో కేసీఆర్ చాలా ధైర్ఘ్యంగా అసెంబ్లీని రద్దు చేశారు. అదే ఊపులో సిట్టింగులకే పెద్ద పీఠ వేస్తూ 105మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టుని ప్రకటించేశారు. మిగిలిన 14మంది అభ్యర్థుల జాబితాని విడుదల చేయడానికి మాత్రం తటపటాయిస్తున్నారు. ఐతే, ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి. ‘మహాకూటమి’కి బలం పెరుగుతోంది.

ఈ మాట జనాల్లోనూ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు వణుకు పుడుతోంది. తాజాగా, మహాకూటమి పుంజుకోవడంపై కేటీఆర్ స్పందించారు. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం కావాలనే ఆలోచన లేదు. మరో పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని‌ స్పష్టం చేశారు. మహాకూటమి పుంజుకునే పరిస్థితే లేదని చెప్పుకొచ్చారు.