కంట్రీఫస్ట్: సర్జికల్‌ స్ట్రయిక్స్‌ పై కేటీఆర్

ktr (6)

భారత సైన్యం పాక్‌లోని ఉగ్రస్థావరాలపై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతుంది. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కేటీఆర్ పూర్తి మద్దతు తెలిపారు.

పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై దాడులు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని అన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ తో దేశ మొత్తం ఆర్మీ వెంట ఉందని చెప్పారు. ‘కంట్రీ ఫస్ట్’ అనే ట్యాగ్ లైన్ ఈ విషయంలో ట్వీట్ చేశారు కేసీఆర్.

కాగా, నియంత్రణ రేఖను దాటి ఉగ్ర‌వాదుల‌పై భారత సైన్యం చేసిన దాడిపైన, తాజా ప‌రిణామాల‌పైన ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన‌ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమవేశం అనంతరం మాట్లాడిన కేంద్రమంత్రి వెంకయ్య.. తాము సైన్యానికి అభినంద‌న‌లు తెలుపుతున్నామని,అన్ని పార్టీలు దీనికి సంపూర్ణ మద్దత్తు తెలిపాయని చెప్పారు.