ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ‘ఖుషి’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం


రీసెంట్ టైమ్స్ లో మరే తెలుగు సినిమాకు రానంత బజ్ తెచ్చుకుంటోంది విజయ్ దేవరకొండ, సమంత పెయిర్ గా నటించిన ‘ఖుషి’. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకులను సిల్వర్ స్క్రీన్ పై అలరించేందుకు సిద్ధమవుతోందీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ‘ఖుషి’ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా టికెట్ బుకింగ్స్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

ఆగస్టు 30 ఉదయం 10 గంటల నుంచి ‘ఖుషి’ టికెట్ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఇప్పటికే బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ యాప్స్ లో రికార్డ్ స్థాయి ఇంట్రెస్ట్స్ ‘ఖుషి’ మూవీకి వస్తున్నాయి. బుక్ మై షో లో 130కె ఇంట్రెస్ట్ లు రావడం ఈ సినిమా మీద ఆడియెన్స్ కున్న క్రేజ్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ ప్రియులతో పాటు విజయ్, సమంత ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా మీద మరింతగా అంచనాలు పెరిగాయి. ‘ఖుషి’ సినిమా మీద పాన్ ఇండియా వైజ్ హ్యూజ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ బజ్ తో టికెట్ బుకింగ్స్ లో భారీ నెంబర్స్ రికార్డ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.

టెక్నికల్ టీమ్:
మేకప్ : బాషా
కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
ఆర్ట్ : ఉత్తర కుమార్, చంద్రిక
ఫైట్స్ : పీటర్ హెయిన్
రచనా సహకారం : నరేష్ బాబు.పి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ : బాబ సాయి
మార్కెటింగ్ : ఫస్ట్ షో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
డి.ఐ, సౌండ్ మిక్స్ ః అన్నపూర్ణ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మాట్రిక్స్
సి.ఇ.ఓ : చెర్రీ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
కొరియోగ్రఫీ : శివ నిర్వాణ
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ.